రాష్ట్రంలో వైసీపి పాలనను నిరసిస్తూ టిడిపి నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. తిరుపతిలోని నంది కూడలిలో టిడిపి సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి వేషధారణలో వినూత్నరీతిలో నిరసన తెలియజేశారు.